కళాభారతిలో ‘అమ్మకు అక్షరమాల’ శిక్షణ కార్యక్రమం
కాకతీయ, కరీంనగర్ : నగరపాలక సంస్థ కరీంనగర్ పరిధిలోని కళాభారతిలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ‘అమ్మకు అక్షరమాల’ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉల్లాస్ లైసన్ ఆఫీసర్ ఆంజనేయులు, సీఆర్పీలు అరుణ, శోభ ఆధ్వర్యంలో అక్షరాస్యత కార్యక్రమంపై సిరి, మల్లికార్జున, శ్రీశైలం, శ్రీ మహాలక్ష్మి పట్టణ సమైక్యల అధ్యక్షులు, ఆర్పీలు, యాక్టివ్ పర్సన్లకు ఒకరోజు శిక్షణ అందించారు.
శిక్షణలో అక్షరాస్యత ప్రాముఖ్యత, మహిళలు అక్షరాస్యులుగా మారితే సాధించే సామాజిక, ఆర్థిక అభివృద్ధి, విద్య వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా స్వరూపరాణి, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, డీఎంసీ శ్రీవాణి హాజరయ్యారు. అలాగే టీఎంసీలు, సీఈవోలు, ఏఎల్ఎఫ్ ఓబీలు, ఆర్పీలు, యాక్టివ్ మెంబర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


