కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన పర్యాటకులు సందర్శించారు. ఎమిలీ, అన్నా, జాక్, రిచర్డ్, మార్గరెట్ లు ఆలయాన్ని వీక్షించి శిల్పకళా వైభవానికి మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఆలయ చరిత్ర, శిల్పకళా వైభవం, నిర్మాణ ప్రత్యేకతల గురించి సౌత్ ఇండియన్ గైడ్ రాజేంద్ర, స్టేట్ గైడ్ మధు, రామప్ప టూరిజం గైడ్ విజయ్ కుమార్ అమెరికా పర్యాటకులకు వివరించారు. కాకతీయుల శిల్పసంపద, శాస్త్రీయ వైభవం, శిల్పుల నైపుణ్యం గురించి తెలుసుకున్న పర్యాటకులు ప్రశంసలు కురిపించారు.
యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందిన ఈ ఆలయాన్ని మరింత మంది విదేశీ పర్యాటకులు సందర్శించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రామప్ప ఆలయానికి విదేశీ పర్యాటకుల రాకతో స్థానిక పర్యాటక రంగం ఉత్సాహభరితంగా ఉంది. అధికారుల కృషి, గైడ్ల సేవలపై అమెరికన్ పర్యాటకులు సంతృప్తి వ్యక్తం చేశారు.


