epaper
Monday, March 2, 2026
epaper

అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ

అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ
వెనుజులా సంపదపై కన్నేసిన ట్రంప్
ఎంసీపీఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
అమెరికన్ పెత్తందారితనానికి నిరసనగా వ‌రంగ‌ల్‌లో ర్యాలీ

కాకతీయ, వరంగల్ సిటీ : స్వతంత్ర దేశమైన వెనుజులాపై అమెరికా అత్యంత పాశవికంగా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను బంధించి న్యూయార్క్‌కు తరలించడం దారుణమని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలను ప్రపంచ శాంతి కోరుకునే ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఎంసిపిఐ(యు) నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం వెనుజులాపై అమెరికా నియంతృత్వ దాడిని ఖండిస్తూ పార్టీ కార్యాలయం నుంచి హెడ్‌పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వెనుజులా ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తూ నినాదాలు చేశారు.

సంపద కోసం దేశాలపై దాడులు
గాదగోని రవి మాట్లాడుతూ, లాటిన్ అమెరికా దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు అమెరికా నియంతృత్వ పద్ధతుల్లో దాడులు చేస్తూ ఆయా దేశాల సహజ సంపదను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వెనుజులాలో లభించే చమురు, బంగారం వంటి వనరులపై కన్నేసి అకస్మాత్తుగా దాడి చేయడం ప్రజాస్వామ్యానికి, ప్రపంచ శాంతికి తీవ్ర ముప్పు అని అన్నారు. సోషలిస్టు భావాలతో సమానత్వం, స్వేచ్ఛ మార్గంలో వెనుజులా అభివృద్ధి చెందుతోందని, భారతదేశానికి కూడా సుమారు 10 శాతం చమురు సరఫరా చేస్తోందని గుర్తు చేశారు. అలాంటి దేశంపై ట్రంప్ కుటిల నీతితో దాడి చేయడం అన్యాయమని విమర్శించారు. సామ్రాజ్యవాద అమెరికా పెత్తందారి పోకడల వల్ల ప్రపంచ శాంతి విచ్ఛిన్నమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

భారత ప్రభుత్వానికి డిమాండ్
ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ వెనుజులాకు అండగా నిలవాలని, మోడీ ప్రభుత్వం కూడా వెనుజులా ప్రజలను ఆదుకునే విధంగా స్పష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర కార్యదర్శి మాలోత్ సాగర్, జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోనె కుమారస్వామి, కన్నం వెంకన్న, జిల్లా నాయకులు సుంచు జగదీశ్వర్, ముక్కెర రామస్వామి, గణిపాక ఓదెలు, మహమ్మద్ మహబూబ్ బాషా, పరిమళ గోవర్ధన్, రాజు, ఎగ్గెని మల్లికార్జున్, మాలోత్ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img