epaper
Wednesday, March 4, 2026
epaper

నాచారంలో కూల్చిన చోటే అంబేడ్కర్ గద్దె పునర్నిర్మాణం

నాచారంలో కూల్చిన చోటే అంబేడ్కర్ గద్దె పునర్నిర్మాణం

– అర్ధరాత్రి కూల్చివేతపై గ్రామస్తుల ఆగ్రహం
– పోలీసు బలగాల మధ్య గద్దె పునర్నిర్మాణం
– డీబీఎఫ్ నేత పి. శంకర్ అరెస్టు యత్నం విఫలం
– ఉద్రిక్తత నడుమ అంబేడ్కర్ చిత్రపటానికి నివాళి

కాకతీయ, గజ్వేల్ : వర్గల్ మండలం నాచారం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను ఆర్‌అండ్‌బీ అధికారులు, గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం అర్ధరాత్రి కూల్చివేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. సమాచారం అందుకున్న గ్రామస్తులు బుధవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పి. శంకర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు పోలీసు బలగాల మధ్య కూల్చిన చోటే గద్దెను పునర్నిర్మించారు. నిర్మాణాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా గ్రామస్తులు, మహిళలు ప్రతిఘటించారు. ఈ సందర్భంగా పోలీసులు పి. శంకర్‌ను అరెస్టు చేయడానికి యత్నించగా మహిళలు అడ్డుకోవడంతో పోలీసులు వెనుదిరిగారు. గద్దె నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి అంబేడ్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఘటన స్థలానికి గజ్వేల్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్సైలు పెద్దఎత్తున చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అదనపు పోలీసు బలగాలు మోహరించారు. ఈ సందర్భంగా పి. శంకర్ మాట్లాడుతూ… అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు కోసం ప్రత్యేక అనుమతులు అవసరం లేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల సాకుతో గద్దె కూల్చివేయడం తగదన్నారు. అర్ధరాత్రి దొంగల్లా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గద్దె కూల్చివేతలో సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులు, గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని కోరారు. దళితులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సంఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అడిషనల్ పోలీస్ కమిషనర్ ఘటన స్థలానికి చేరుకుని సంఘ నాయకులతో చర్చలు జరిపారు. విగ్రహ ఏర్పాటు విషయంలో అనుమతులు తీసుకోవాలని సూచించగా, అంబేడ్కర్ విగ్రహాలకు అనుమతుల అవసరంపై నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరికి ఉద్రిక్త పరిస్థితి సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, దళిత సంఘాల నాయకులు, గ్రామ అంబేడ్కర్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పోచయ్య మృతికి వంటేరు సంతాపం

పోచయ్య మృతికి వంటేరు సంతాపం కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ మండలంలోని సింగాటం...

అంగన్వాడి బలోపేతానికి సంపూర్ణ సహకారం

అంగన్వాడి బలోపేతానికి సంపూర్ణ సహకారం * 7వ వార్డు కౌన్సిలర్ పోతుగంటి ప్రసాద్ కాకతీయ,చేర్యాల:...

ఆయకట్టును స్థిరీకరించాలని మంత్రి ఉత్తమ్ కు ఎంపీ చామల వినతి

ఆయకట్టును స్థిరీకరించాలని మంత్రి ఉత్తమ్ కు ఎంపీ చామల వినతి రైతన్నలకు అండగా...

రంగేసి.. చిందేసి..

రంగేసి.. చిందేసి.. * అంబరాన్నంటిన హోలీ సంబురాలు * రంగుల్లో మునిగితేలిన కాకతీయ,చేర్యాల: చేర్యాల పట్టణంతో...

కాంగ్రెస్ హామీల్లో పూర్తిగా వైఫల్యం- వంటేరు ప్రతాప్ రెడ్డి

కాంగ్రెస్ హామీల్లో పూర్తిగా వైఫల్యం- వంటేరు ప్రతాప్ రెడ్డి - హైదరాబాద్ బ్రాండ్‌కు...

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపండి

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపండి * చేర్యాల ఎస్సై ని కలిసిన...

సహజ రంగులతోనే హోలీ జరుపుకోవాలి

సహజ రంగులతోనే హోలీ జరుపుకోవాలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ గణపతి కాకతీయ,...

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు సిద్దిపేట అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీహెచ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img