అంబేద్కర్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్
కాకతీయ, ములుగు ప్రతినిధి : అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ప్రాధాన్యతపై అవగాహన పెంపొందించాలని సూచించారు. అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో కలిసి వేడుకలకు ఆహ్వానించారు. సుధీర్ రామ్నాథ్ కేకన్ మాట్లాడుతూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ పద్నాలుగు సాయంత్రం నాలుగు గంటలకు ఏటూరునాగారం వై జంక్షన్లో ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మూడు రోజులపాటు వాలీబాల్ టోర్నమెంట్, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు, బహుమతుల పంపిణీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిలువేరు అన్నమయ్య, వేంపల్లి శంకర్, పరికి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.


