epaper
Sunday, March 1, 2026
epaper

Forbes India Rich List 2025: దేశంలో ధనవంతుల జాబితాలో అంబానీ అగ్రస్థానం.. రెండో స్థానంలో ఎవరంటే?

కాకతీయ, బిజినెస్ డెస్క్: ఫోర్బ్స్ విడుదల చేసిన 2025 భారత బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మరోసారి దేశంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అయితే, ఆయన నికర ఆస్తులు గత సంవత్సరం కంటే స్వల్పంగా తగ్గాయి. ఈసారి అంబానీ సంపద 12 శాతం తగ్గి 105 బిలియన్ అమెరికన్ డాలర్ల వద్ద స్థిరపడింది. ఇది సుమారు 14.5 బిలియన్ డాలర్ల నష్ట పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఫోర్బ్స్ ప్రకారం, భారత బిలియనీర్ల మొత్తం సంపద కూడా ఈ ఏడాది కొంత తగ్గింది. రూపాయి విలువ పడిపోవడం, సెన్సెక్స్‌లో 3 శాతం వరకు క్షీణత రావడం వల్ల భారతదేశంలోని 100 మంది అగ్రశ్రేణి కోటీశ్వరుల కలిపి సంపద 9 శాతం తగ్గి సుమారు 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ జాబితా ఫోర్బ్స్ అధికారిక వెబ్‌సైట్‌లైన forbes.com/india మరియు forbesindia.com లో అందుబాటులో ఉంది. అదనంగా, ఫోర్బ్స్ ఆసియా అక్టోబర్ ఎడిషన్‌లో కూడా ఈ ర్యాంకింగ్ ప్రచురించింది.

రెండవ స్థానంలో గౌతమ్ అదానీ:

మౌలిక వసతుల రంగ దిగ్గజం, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ ఈ జాబితాలో రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన సంపద ప్రస్తుతం 92 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. గత ఏడాది హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వెలుగులోకి వచ్చిన తర్వాత అదానీ గ్రూప్ షేర్లు భారీగా క్షీణించిన విషయం తెలిసిందే.అయితే, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) 2025 సెప్టెంబర్‌లో ఇచ్చిన నివేదికలో హిండెన్‌బర్గ్ చేసిన మోసపూరిత లావాదేవీల ఆరోపణలను నిర్ధారించే ఆధారాలు లేవని తెలిపింది. దీంతో అదానీ గ్రూప్ షేర్లు మళ్లీ స్థిరపడటంతో ఆయన సంపద కూడా కొంత మేరకు పునరుద్ధరించింది.

ఫోర్బ్స్ జాబితా ప్రకారం, భారత బిలియనీర్లలో టెక్, ఎనర్జీ, ఫార్మా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు ప్రధానంగా ఉన్నారు. అయితే ఈ సంవత్సరం మార్కెట్ పరిస్థితులు, గ్లోబల్ ఆర్థిక ఒత్తిడుల కారణంగా చాలా మంది బిలియనీర్ల నికర ఆస్తులు తగ్గినట్లు ఫోర్బ్స్ విశ్లేషణ చెబుతోంది.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుడీఎస్పీ రవీందర్...

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల...

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు – కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు

45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు… కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు కాక‌తీయ‌, తెలంగాణ...

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్...

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత – నిమ్స్‌లో చికిత్స

బిగ్ బ్రేకింగ్‌..! మాజీ మంత్రి జీవన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత ఇటీవల రాజకీయ పరిణామాలతో...

ఖమ్మం నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం – విద్యార్థిపై దాడి

నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం మత్తులో ఇద్దరు విద్యార్థుల దాడి… ఇంటర్ విద్యార్థి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img