ఉచిత వైద్య శిబిరానికి అనుహ్య స్పందన
ధ్రువ హాస్పిటల్ ఆధ్వర్యంలో 250 మందికి వైద్య పరీక్షలు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో ధ్రువ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి గ్రామస్థుల నుంచి విశేష స్పందన లభించింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ప్రజలు శిబిరానికి తరలివచ్చి వైద్య సేవలు పొందారు. స్థానిక సర్పంచ్ పొన్నం సునీత అనిల్ గౌడ్ ముఖ్యఅతిథిగా శిబిరాన్ని ప్రారంభించారు. హాస్పిటల్ ఎండీ డాక్టర్ శ్రీకర్ నేతృత్వంలోని వైద్య బృందం సుమారు 250 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేసింది. నిరుపేదలు, వృద్ధులు, మహిళలు అధిక సంఖ్యలో సేవలు పొందారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇలాంటి శిబిరాలు ఎంతో అవసరమని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పొన్నం సునీత అనిల్ గౌడ్ పేర్కొంటూ నిర్వాహకులను అభినందించారు.


