Alumni reunion
కాకతీయ, లక్సెట్టిపేట : పట్టణంలోని విశ్వశాంతి విద్యాలయంలో 2012-13 విద్యాసంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు అత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులను సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పిల్లలు ఎదిగినపుడు తల్లితండ్రులకు పుత్రోత్సాహం ఎలాగో, అలాగే విద్యార్థులు ఉద్యోగులుగా, వ్యాపారవేత్తలుగా, రాజకీయనాయకులుగా ఎదిగినప్పుడే ఉపాధ్యాయులుగా తాము సంతోషపడతామని అన్నారు. అలనాటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాజన్న, రత్నాకర్, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్ధులు పాల్గొన్నారు.


