కాకతీయ, గీసుగొండ: ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలకు జిల్లా కాంగ్రెస్ నాయకుడు అల్లం బాలకిషోర్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. మండల కేంద్రానికి చెందిన కోట కొమురమ్మ, కోట కుమారస్వామి, గట్టికిందపల్లి గ్రామానికి చెందిన పులి అనిల్ మరణించారు. వారి కుటుంబాలను కాంగ్రెస్ నాయకులు రడం భరత్ కుమార్, వీరగోని రాజ్ కుమార్, అల్లం మర్రెడ్డి, అల్లం బాలకిషోర్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5వేల చొప్పున సహాయం అందజేశారు. కార్యక్రమంలో గీసుగొండ సొసైటీ చైర్మన్ రడం శ్రీధర్, మాజీ సర్పంచులు దౌడు బాబు, కోల కుమారస్వామి, మేకల యాకుబ్, పొగాకు భిక్షపతి, దౌడు సునీల్, పేర్ల శ్రావణ్, రామ కుమారస్వామి, మారుపాక శ్రీనివాస్ రెడ్డి, రాగిరి రాజేందర్, మంద అనిల్, పాకనాటి సురేష్, ఈనుముల ప్రభాకర్, దౌడు రాజేష్, ఎమ్డీ షరీఫ్, కోట ఐలయ్య, దౌడు నర్సయ్య, చినగారి నరేష్, చిన్నగారి కృష్ణ, మేకల బాబు, దౌడు రాజు, మేకల సుమన్, దౌడు రాంబాబు, ప్రకాష్, రవి, జున్ను ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


