ప్రజలంతా బీజేపీ వైపే…
స్థానిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయం…
జిల్లా ఎన్నికల కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్…
పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం…
అవినీతిలో కూరుకుపోయిన కల్వకుంట్ల కుటుంబం…
బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్…
స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం…
పార్టీ గెలుపుకు కృషి చేయాలని శ్రేణులకు పిలుపు…
కాకతీయ, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం మంగళవారం మామునూరు లోని సత్యం కన్వెన్షన్ హాల్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎన్నికల కన్వీనర్, మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్, మాజీ పార్లమెంటు సభ్యులు ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్, మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్, డాక్టర్ టి.రాజేశ్వరరావు, రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కంభంపాటి పుల్లారావు లు పాల్గొన్నారు. ఏ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయమని, దేశ అభివృద్ధికి పాటుపడేది ఒక్క బిజెపి పార్టీయే అని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమావేశంలో బీజేపీ అధిష్ఠానం జడ్పీటిసి, ఎంపీటీసీ ఎన్నికలలో పోటీచేసే ఆశావహుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందనీ, జడ్పీటిసి అభ్యర్థులు ఆశావహులు ఒక్కో మండలంలో దరఖాస్తులు నాలుగు నుండి ఐదు, ఇంకొక మండలంలో ఐదు నుండి ఆరు, మిగితా మండలాల్లో పదికి పైనే ఆశావహులు ఉన్నారని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో కార్యకర్తలను గెలిపించుకొని నాయకులుగా చూడాలనే పిలుపు వరంగల్ జిల్లాలో గ్రామ గ్రామాన యువతలో, కార్యకర్తల్లో బలంగా వెళ్ళిందనీ పేర్కొన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఒక్క సంకేమ పథకాన్ని అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిందన్నారు. ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్ స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడుగుతుందని విమర్శించారు. రైతులకు సన్న వడ్ల కు బోనస్, చేయుత పెన్షన్ 4 వేలకు పెంపు గాలికి వదిలేసిందని గంట రవికుమార్ ఆరోపించారు. దేశంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతు సంక్షేమమే ప్రధాని మోడీ ధ్యేయం అన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిoదని విమర్శించారు. అవినీతి, అక్రమాల్లో కల్వకుంట్ల కుటుంబం కూరుకుపొయ్యింది అన్నారు. దీంతో ప్రజలందరూ బిజెపి వైపు చూస్తున్నారని స్పష్టం చేశారు. బరిలో ఎవరు నిలిచినా కలిసికట్టుగా పని చేసి స్థానిక ఎన్నికల్లో పార్టీకి అధిక సంఖ్యలో సీట్లు సాధించాలని శ్రేణులను మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ కోరారు. ఈసారి ప్రతీ గ్రామంలో కాషాయ జెండా ఎగరడం ఖాయం అని పేర్కొన్నారు.
పార్టీ కోసం పనిచేసే ప్రతీ కార్యకర్తకు గుర్తింపుంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు వివరించాలి, గ్రామాల్లో బీజేపీ చేసిన అభివృద్ధిని చూపించాలనీ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తను పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందని పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలోని ప్రతి పల్లె యువత ప్రతి కార్యకర్త సైనికులల పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, గురుమూర్తి శివకుమార్, రత్నం సతీష్ షా, వన్నాల వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ జక్కు రమేష్, వనం రెడ్డి, పార్లమెంటు కన్వీనర్ తాళ్ల పెళ్లి కుమారస్వామి, మాజీ జడ్పిటిసి సునీత, స్థానిక సంస్థల ఎన్నికల మండల ప్రభరీలు, కన్వీనర్లు, మండల అధ్యక్షులు, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



