కూసం రాజమౌళి కాంస్య విగ్రహ ఏర్పాటుకు అఖిలపక్ష కమిటీ
కాకతీయ, గీసుగొండ: దేశం గర్వించేలాగా గంగాదేవిపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన జాతీయ ఆదర్శ గ్రామ మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి స్మారకార్థం గ్రామంలో ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గీసుగొండ మండలం గంగాదేవిపల్లి గ్రామంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షుడిగా కూసం రమేష్‌ను ఎంపిక చేయగా, సభ్యులుగా గోనె కుమారస్వామి, సోమిరెడ్డి శీను, ఆకుల రుద్ర ప్రసాద్, గోనె మలయ్య, గోనె నాగరాజు, కూసం లింగయ్య, చల్ల మల్లయ్య, గోనె రాజయ్య, గడ్డమీద బాలరాజు, ముస్కు రమేష్, చల్ల లింగం, గోపాల్ రాజు, కూసం మల్లిఖార్జున్, గోని సంపత్‌లను నియమించారు. ఈ సందర్భంగా గోనె కుమారస్వామి మాట్లాడుతూ కూసం రాజమౌళి గ్రామ అభివృద్ధికి విశేషంగా కృషి చేసి గంగాదేవిపల్లి గ్రామాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. ఆయన చేసిన సేవలు గ్రామ ప్రజలకు మరువలేనివని పేర్కొన్నారు. ఆయన సేవలకు గుర్తుగా గ్రామంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించిందన్నారు. అలాగే కూసం రాజమౌళి సంతాప సభను ఈ నెల 18-03-2026న గంగాదేవిపల్లి గ్రామంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, మండల ప్రజానీకం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో హాజరై ఆయన ఆత్మకు శాంతి చేకూరేలా నివాళులు అర్పించాలని కోరారు.


