బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అన్ని పార్టీలు కల్పించాలి
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ నగరంలోని పోచమ్మ మైదానం నుండి వరంగల్ చౌరస్తా వరకు బీసీ బంద్ కు మద్దతుగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ బీసీ బిల్లుకు మద్దతుగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపుమేరకు శనివారం రోజు బంద్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ సందర్భంగా పోచమ్మ మైదానం నుండి వరంగల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అన్ని సెంటర్లను బిసి రిజర్వేషన్ కు మద్దతుగా బంద్ చేయించామని తెలిపారు. బీసీలందరం ఐక్యమత్యంగా ఉండి బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలని దానికి అన్ని పార్టీలు మద్దతు తెలపాలని ఎమ్మెల్సీ సారయ్య కోరారు.
ఈ ర్యాలీలో కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్, శ్రీబస్వరాజు శిరీష శ్రీమన్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొరివి పరమేష్, తూర్పు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సలీం, మాజీ కార్పొరేటర్ లు తొత్తరి లక్ష్మణ్ దామెర సర్వేశం, బిల్లా శ్రీకాంత్, జన్ను రవి కరాటే ప్రభాకర్, తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు


