- పాలకవర్గం ద్వారా అర్బన్ బ్యాంక్ అభివృద్ధి
- సుడా చైర్మసహకార రంగంలో కరీంనగర్ చరిత్ర సృష్టించింది
- నూతనన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ : సహకార రంగంలో కరీంనగర్ జిల్లాకు విశిష్టమైన చరిత్ర ఉందని, అర్బన్ బ్యాంక్‌ను కూడా అదే దిశగా నడిపించేందుకు ఒక సుస్థిరమైన, నిబద్ధత కలిగిన పాలకవర్గాన్ని సభ్యులు ఎన్నుకోవాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎనిమిదేళ్లుగా అర్బన్ బ్యాంక్‌కు పాలకవర్గం లేకపోవడానికి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కారణమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అడ్డంకులను తొలగించి ఎన్నికలు నిర్వహించడం ద్వారా బ్యాంక్ అభివృద్ధికి దారితీసే చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం 92 కోట్ల పైచిలుకు డిపాజిట్లు, సుమారు 50 కోట్ల రుణాలతో అర్బన్ బ్యాంక్ విజయవంతంగా కొనసాగుతోందని నరేందర్ రెడ్డి చెప్పారు. సభ్యులందరూ తమ ఓటు హక్కును వినియోగించి అనుభవం ఉన్న, నిబద్ధత గల అభ్యర్థులను ఎన్నుకోవాలని కోరారు. ప్రస్తుతం బ్యాంక్‌లో దాదాపు 9 వేల మంది సభ్యులు ఉన్నారని, వారందరూ గుర్తింపు కార్డుతో వచ్చి తప్పక ఓటు వేయాలని సూచించారు. సమావేశంలో చర్ల పద్మ, దండి రవీందర్, బొబ్బిలి విక్టర్, ఎండీ చంద్, షబానా మహమ్మద్, జ్యోతిరెడ్డి, హసీనా, అస్తాపురం రమేష్, శిల్ప తదితరులు పాల్గొన్నారు.


