కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి
పంట నష్టం వివరాలను ఆదివారంలోగా నమోదు చేయాలి
జిల్లా కలెక్టర్ సత్య శారద
కాకతీయ, పర్వతగిరి : రైతులు పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించరు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మాల్యా తండా, ఏనుగల్లు, చౌటపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శనివారం పరిశీలించారు. రైతులు కొనుగోలు కేంద్రంలో పోసుకున్న ధ్యానం కుప్పలను పరిశీలించి, ధాన్యం ఎప్పుడు తీసుకువచ్చారు? స్థానికంగా కల్పించిన వసతులపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తేమ శాతాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ రైతులు తమ సమీపంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి, మద్దతు ధర పొందాలని సూచించారు. భారీ వర్షాలకు నష్టపోయిన పంట వివరాలు ఆదివారంలోగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ రైతులను కోరారు. వ్యవసాయాధికారులు పంట నష్టపోయిన ఏ ఒక్క రైతును వదలకుండా అర్హులైన రైతులందరి నష్ట వివరాలు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పి సీఈఓ, ఇంచార్జి డీఆర్డీఓ రామిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఐకెపి సిబ్బంది, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.


