- 42 శాతం రిజర్వేషన్లు సాధించుకోవాలి
- రిజర్వేషన్లపై రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారు
- మాజీ ఎంపీ వీ హనుమంతరావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కామారెడ్డిలో బహిరంగ సభలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, సీఎం రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుల, జనగణన చేసి బీసీలకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ అమలుచేస్తున్నామని అన్నారు. బీసీ రిజర్వేషన్లను కొంతమంది నాయకులు అడ్డుకుంటున్నారని, కోర్టులో కేసులు దాఖలు చేశారని మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీలకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారన్నారు.
అసెంబ్లీలో బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు తెలుపుతాయని, బయట ధర్నాలు చేస్తాయన్నారు. అక్టోబర్ 8న హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో అందరూ పార్టీలకు అతీతంగా బీసీ నేతలు బయటకు రావాలని, 42 కోసం బీసీలు బయటకు రాకపోతే భవిష్యత్తులో ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావని అన్నారు. బీసీలంతా ఐక్యంగా ఉండాలని, రానున్న ఎన్నికల్లో బీసీలకే ఎక్కువ ప్రాధాన్యత ఉందని అన్నారు. స్థానిక ఎన్నికలు, విద్య, ఉద్యోగం అన్ని అంశాల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు కావాల్సిందేనని వీహెచ్ అన్నారు.


