కాకతీయ, కరీంనగర్ : రాష్ట్ర విద్యారంగంలో విశిష్ట సేవలందిస్తున్న అల్ఫోర్స్ విద్యాసంస్థలు మరో ఘనత సాధించాయి. గ్లోబల్ ట్రయంఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఇండియా కాంక్లేవ్ కార్యక్రమంలో అల్ఫోర్స్ కు అత్యుత్తమ సీబీఎస్ఈ పాఠశాల అవార్డు లభించింది. ఈ సందర్భంగా సంస్థ అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉత్తమ ప్రమాణాలు అందించడం తమ ప్రధాన ధ్యేయమని, అల్ఫోర్స్ విద్యార్థులు ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, సీఏ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో ప్రతిభ చాటుతున్నారని తెలిపారు. ఈ విజయానికి సిబ్బంది కృషి, తల్లిదండ్రుల సహకారమే కారణమని, ఈ అవార్డు వారి అందరికీ అంకితం చేస్తున్నానని అన్నారు. అవార్డు లభించిన సందర్భంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు నరేందర్ రెడ్డి కృషిని అభినందించారు.
అల్ఫోర్స్ కు అత్యుత్తమ సీబీఎస్ఈ పాఠశాల అవార్డు
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


