గణిత పోటీల్లో అల్ఫోర్స్ విద్యార్థికి టాప్ ర్యాంక్
ఆర్యభట్ట గణిత ఛాలెంజ్‌లో టాప్–100లో స్థానం
9వ తరగతి విద్యార్థి ఏ. గౌతమ్‌కు ఘన సన్మానం
కాకతీయ, కరీంనగర్ : అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థి జాతీయ స్థాయి గణిత పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు కీర్తి తీసుకొచ్చాడు. ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి ఆర్యభట్ట గణిత ఛాలెంజ్లో 9వ తరగతి విద్యార్థి ఏ. గౌతమ్ దేశవ్యాప్తంగా తొలి 100 మంది విజేతల్లో స్థానం సాధించాడు. ఈ సందర్భంగా కొత్తపల్లిలోని పాఠశాలలో జరిగిన అభినందన సభకు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గణితంపై పట్టు సాధిస్తే పోటీ పరీక్షలను సులభంగా ఎదుర్కొనవచ్చని, జ్ఞాపకశక్తి, విశ్లేషణ సామర్థ్యాలు మెరుగుపడతాయని ఆయన తెలిపారు. పాఠశాల స్థాయిలో శిక్షణ, జాతీయ పోటీలకు ఎంపిక ద్వారా ప్రతిభను వెలికితీస్తున్నామని పేర్కొన్నారు. విజేత గౌతమ్‌కు పుష్పగుచ్ఛం, అర్హత పత్రం అందజేసి అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


