ఆలేటి రేఖకు పీహెచ్‌డీ పట్టా
గణిత మోడళ్లపై కీలక పరిశోధన
సిన్–ఇకో సిస్టమ్, ఎపిడిమియాలజీపై అధ్యయనం
ఆచార్య బి. హరిప్రసాద్ పర్యవేక్షణ
యూనివర్సిటీ పాలకుల అభినందనలు
కాకతీయ, హైదరాబాద్ : హిమాయత్‌నగర్‌లోని చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన ఆలేటి రేఖ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) పట్టాను సాధించారు. “స్టడీ ఆఫ్ సమ్ మ్యాథమేటికల్ మోడల్స్ ఆన్ సిన్–ఇకో సిస్టమ్ అండ్ ఎపిడిమియాలజీ” అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనకు ఈ పట్టా లభించింది. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి. శంకర్ లింగం చేతుల మీదుగా ఆమె పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు. ఈ పరిశోధనను ఆచార్య బి. హరిప్రసాద్ పర్యవేక్షణలో పూర్తి చేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఛాన్సలర్, ఫౌండర్ సి.హెచ్.వి. పురుషోత్తం రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ సి.హెచ్. సాత్విక రెడ్డి ఆలేటి రేఖను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎం. రవీందర్, డీన్ అభివృద్ధి ఆచార్య క్రిస్టోఫర్, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ ఆచార్య ఎస్. కవిత, పరీక్షల కంట్రోలర్ ఆచార్య బి. రాజేందర్ రెడ్డి, డిప్యూటీ కంట్రోలర్ ఆచార్య ఇ. జగదీశ్ కుమార్ పాల్గొన్నారు.


