epaper
Thursday, January 15, 2026
epaper

మూత‌ప‌డ‌నున్న అల్ ఫలాహ్.. మ‌రి ఆ 600 విద్యార్థుల ప‌రిస్థితేంటి..?

మూత‌ప‌డ‌నున్న అల్ ఫలాహ్.. మ‌రి ఆ 600 విద్యార్థుల ప‌రిస్థితేంటి..?
ఎర్రకోట బ్లాస్ట్ తర్వాత అల్ ఫలాహ్‌పై అనుమానాల మబ్బు
ఈడీ దాడులతో యూనివర్సిటీ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తత
భ‌విష్య‌త్తు ఏంటో తెలీక విద్యార్థుల గుండెల్లో గుబులు

కాక‌తీయ, నేష‌న‌ల్ డెస్క్ : దేశ‌ రాజధాని ఢిల్లీలో ఇటీవ‌ల‌ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు బ్లాస్ట్ దేశాన్ని కలవరపరిచింది. 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయగా, 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ప్రధాన నిందితులు హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నవారేనని దర్యాప్తు సంస్థలు గుర్తించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దీంతో యూనివర్సిటీపై అనుమానాల మబ్బు కమ్ముకుంది. అల్ ఫలాహ్ మూత‌ప‌డ‌నుంద‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. మంగళవారం ఈడీ భారీ దాడులు జరపటం, ఫండ్స్‌–బ్యాంకు లావాదేవీలను పరిశీలించడం మరింత ఆందోళనకు దారి తీసింది.

దాదాపు 600 మంది విద్యార్థులు చదువుతున్న ఈ యూనివర్సిటీని ఇప్పుడు టెర్రర్ డెన్ అని పిలుస్తూ సోషల్ మీడియాలో క్షోభ వ్యక్తం అవుతోంది. కాలేజీని మూసేయాలి, పునాదులతో నేలమట్టం చేయాలి అంటూ కొందరు వర్గాలు ప్రచారం చేస్తున్నారు. కానీ, ఈ ప్రచారం వెనక వందలాది విద్యార్థుల భవిష్యత్తు ఉందన్న విషయం ఎవరూ పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా మెడికల్ బ్రాంచ్‌లో చదువుతున్న వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న ఓ విద్యార్థి తన బాధను మీడియాతో పంచుకున్నారు. “మా యూనివర్సిటీని టెర్రర్ డెన్ అంటున్నారు. రేపు కాలేజీ మూసేస్తే మా ఫ్యూచర్ ఏంటి? ఐదు సంవత్సరాలు కష్టపడ్డాం, లక్షలు ఖర్చు పెట్టాం. కానీ ఇప్పుడు ఆస్పత్రులు కూడా మమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు” అని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఒకవేళ అల్ ఫలాహ్ యూనివర్సిటీపై తీవ్రమైన చర్యలు తీసుకుంటూ క్యాంపస్ మూసివేత వరకు వెళ్లితే.. మొదట దెబ్బతినేది మెడికల్, ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలే. ప్రభుత్వం జోక్యం చేసుకుంటే విద్యార్థులను ఇతర యూనివర్సిటీలకు మైగ్రేట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ దేశంలో మెడికల్/ప్రొఫెషనల్ కోర్సుల్లో ఖాళీలు చాలా తక్కువ. అందువ‌ల్ల‌ అందరికీ సీట్లు లభిస్తాయన్న హామీ లేదు. నీట్ కష్టం, కోచింగ్, ఫీజులు, హాస్టల్ ఛార్జీలు.. ఇవి అన్నీ కలిపితే విద్యార్థులు ఇప్పటికే లక్షల్లో కాదు, కోటీల్లో పెట్టుబడి పెట్టి ఉంటారు. యూనివర్సిటీ మూతపడ్డట్లయితే ఈ మొత్తం ఒకే రోజులో అర్థంలేనిది అవుతుంది. ఈ ప‌రిణామాల న‌డుమ ఆ 600 విద్యార్థులు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీక అల్లాడిపోతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ 12 మందికిపైగా మావోయిస్టులు హతం మృతులంతా కొంటా ఏరియా కమిటీ...

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌

2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్‌ అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం ఆక్లాండ్‌లో ఘనంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img