కాంగ్రెస్కు ఆకుల సుభాష్ రాజీనామా
ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడి నిర్ణయం
కాకతీయ, గణపురం : ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఆకుల సుభాష్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ముందుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు తెలియజేసినట్లు తెలిపారు. 24 గంటల అనంతరం పత్రికా మాధ్యమాల ద్వారా అధికారిక ప్రకటన చేయనున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ముందు గండ్ర సత్యనారాయణరావుతో నేరుగా మాట్లాడి కాంగ్రెస్లో చేరినట్టు, ఇప్పుడు కూడా ఎలాంటి మధ్యవర్తులు లేకుండానే పార్టీ నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. ఇది పూర్తిగా తన స్వయంకృత నిర్ణయమని, ఆవేశం లేదా తొందరపాటు వల్ల తీసుకున్నది కాదని స్పష్టం చేశారు. కొంతకాలం రాజకీయాల నుంచి దూరంగా ఉండి ఆత్మపరిశీలన చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నానని, భవిష్యత్ కార్యాచరణను కాలమే నిర్ణయిస్తుందని ఆకుల సుభాష్ పేర్కొన్నారు.


