epaper
Sunday, March 1, 2026
epaper

‘దృశ్యం 3’ నుంచి తప్పుకున్న అక్షయ్ ఖన్నా

‘దృశ్యం 3’ నుంచి తప్పుకున్న అక్షయ్ ఖన్నా
నిర్మాతలకు భారీ ఆర్థిక నష్టం.. లీగల్ నోటీసులతో ముదిరిన వివాదం

కాక‌తీయ‌, సినిమా : బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘దృశ్యం 3’ సినిమాకు సంబంధించిన వివాదం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైన నటుడు అక్షయ్ ఖన్నా అనూహ్యంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో నిర్మాతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందే కాంట్రాక్ట్ పై సైన్ చేసి, పారితోషికం కూడా తీసుకున్నప్పటికీ సినిమా నుంచి బయటకు రావడం వల్ల తమకు భారీ నష్టం వాటిల్లిందని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘దృశ్యం 3’ నిర్మాతలు అక్షయ్ ఖన్నాకు లీగల్ నోటీసులు పంపించారు. ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల జరిగిన నష్టానికి బాధ్యత వహించాల్సిందేనని నోటీసుల్లో స్పష్టం చేసినట్లు సమాచారం. అవసరమైతే కోర్టును ఆశ్రయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని నిర్మాతలు తేల్చిచెప్పారు.

కొత్త ఎంపిక… షూటింగ్‌పై ప్రభావం
అక్షయ్ ఖన్నా తప్పుకోవడంతో సినిమా షెడ్యూల్ మొత్తం మారిపోయిందని నిర్మాతలు పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రీ–ప్రొడక్షన్ దశలో ఉన్న ప్రాజెక్ట్‌కు ఈ పరిణామం తీవ్ర ఆటంకంగా మారిందని తెలిపారు. ఆయన స్థానంలో ఇప్పుడు నటుడు జైదీప్ అహ్లావత్‌ను ఎంపిక చేసినట్లు అధికారికంగా వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ వివాదంపై అక్షయ్ ఖన్నా నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. దీంతో ఈ వ్యవహారం న్యాయపరమైన దిశగా వెళ్తుందా? లేక పరస్పర రాజీతో ముగుస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రధాని ఆశీర్వాదాలు పొందిన విజయ్ – రశ్మిక

ప్రధాని ఆశీర్వాదాలు పొందిన విజయ్ – రశ్మిక కాక‌తీయ‌, సినిమా :ప్రధానమంత్రి నరేంద్ర...

ఉదయ్‌పూర్‌లో ఘనంగా విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం

ఉదయ్‌పూర్‌లో ఘనంగా విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ...

ఏప్రిల్‌ 7న ‘వారణాసి’

ఏప్రిల్‌ 7న 'వారణాసి' కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: సినీ ప్రేమికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న...

అల్లు అర్జున్ జోడీగా శ్రద్ధా కపూర్?

అల్లు అర్జున్ జోడీగా శ్రద్ధా కపూర్? కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: టాలీవుడ్ ఐకాన్...

జూలై 9న ‘విశ్వంభర’ !

జూలై 9న ‘విశ్వంభర’ ! కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల...

య‌ష్ త‌గ్గేదేలే..

య‌ష్ త‌గ్గేదేలే.. కాక‌తీయ‌,సినిమా డెస్క్‌ : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం విడుదల...

నన్ను కాపాడటానికి ఎవరూ లేరు: రేణు దేశాయ్‌

నన్ను కాపాడటానికి ఎవరూ లేరు: రేణు దేశాయ్‌ కాక‌తీయ‌, సినిమా డెస్క్ :...

అనిల్ అరుదైన ఘ‌న‌త‌

అనిల్ అరుదైన ఘ‌న‌త‌ కాక‌తీయ‌, సినిమా డెస్క్ : టాలీవుడ్‌లో ఇప్పుడు అనిల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img