కోకో పోటీల్లో ప్రతిభ చాటిన అక్షర హైస్కూల్
కాకతీయ,నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని అక్షర స్కూల్ విద్యార్థులు అండర్ 14,17 కోకో పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయిలో ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు.మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి ప్రవేట్ పాఠశాలల కోకో పోటీలు నిర్వహించగా నర్సింహులపేట గ్రామానికి చెందిన పోలీస్ హోమ్ గార్డ్ నయీమ్ పాష కూతుర్లు సైనాజ్,సన ఇద్దరూ పాల్గొని జిల్లాస్థాయిలో ద్వితీయ బహుమతిని పొందడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి పొందడం పట్ల అక్షర యాజమాన్యం కరస్పాండెంట్ సింగారపు యాకయ్య,వైస్ ప్రిన్సిపాల్ తిరునగిరి శ్రీధర్,పిఈటీలు అనిల్,అరుణ మరియు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.


