విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి
ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై కుప్పకూలిన చార్టర్డ్ విమానం
అజిత్ పవార్‌తో పాటు మరో ముగ్గురు మృతి
జిల్లా పరిషత్ ఎన్నికల క్యాంపెయిన్‌కి వెళ్తుండగా దుర్ఘటన
కాకతీయ, నేషనల్ డెస్క్ : మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (ఎన్‌సిపి నేత) ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయంలో రన్‌వేపై ప్రమాదానికి గురై దుర్ఘటన చోటుచేసుకుంది. ఇది ముంబై నుంచి బారామతి వైపు చేస్తున్న ల్యాండింగ్ ప్రయత్నంలో జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో భవిష్యత ఎన్నికల ప్రచార సభలకు వెళ్తున్న అజిత్ పవార్ కూడా మృతిచెందారని అనేక ప్రముఖ మీడియా సంస్థలు ధృవీకరించాయి. ప్రస్తుతం అందున్న అప్డేట్ల ప్రకారం, ఉదయం సుమారు 8:45 గంటల సమయంలో చార్టర్డ్ విమానం ల్యాండింగ్ అవుతుండగా అదుపు కోల్పోయి రన్‌పై పడిపోయింది. ప్రమాద సమయంలో విమానం తీవ్రంగా నాశనమై మంటలు, పొగలు పైకొచ్చిన దృశ్యాలు వెలుగు చూసాయి. ఈ ఘటనలో అజిత్ పవార్‌తో పాటు విమానంలో ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు కూడా అక్కడికక్కడే మృతిచెందారని ప్రాథమిక నివేదికలు తెలియజేస్తున్నాయి. అజిత్ పవార్ బారామతికి వెళ్లడానికి సిద్దమై ఉన్న సమయంలో జరిగిన ఈ ప్రమాదం మహారాష్ట్రలో తీవ్ర విషాదాన్ని సృష్టించింది. ఆయన జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచార సభలకు హాజరుకావడానికి ప్రయాణిస్తుండగా ఈ ఘోర సంఘటన చోటుచేసుకుంది. వివిధ పార్టీ నేతలు, ప్రజలు ఈ విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదంలోని సంఘటన, కారణాలపై అధికారిక దర్యాప్తు కొనసాగుతున్నది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం, పార్టీ వర్గాలు సంతాపాలు తెలియజేస్తున్నారు.


