epaper
Thursday, April 9, 2026
epaper

అవగాహనతోనే ఎయిడ్స్‌ నియంత్రణ

అవగాహనతోనే ఎయిడ్స్‌ నియంత్రణ
పరీక్షలు, చికిత్సలు ఉచితంగా అందుబాటులో
యువతలో అవగాహన పెంపుపై దృష్టి సారించాలి
గర్భిణీలకు ప్రత్యేక పరీక్షలు, నివారణ చర్యలు
కలెక్టర్ డాక్టర్ సత్యశారద

కాకతీయ, వరంగల్ : ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరికి సమగ్ర అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల్లో నాలుగో రోజు ఎయిడ్స్ అవగాహన, నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కాకతీయ మెడికల్ కళాశాల (కెఎంసి) నుండి ఎంజీఎం ఆసుపత్రి కూడలి వరకు నిర్వహించిన రెడ్ రన్ వాకథాన్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది, ఆశాలు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని “ఎయిడ్స్ నివారణ” నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. ర్యాలీ అనంతరం ఎంజీఎం కూడలి వద్ద నిర్వహించిన మానవహారంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిడ్స్‌పై సరైన అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, సంక్రమిత రక్త మార్పిడి, కలుషిత సూదులు, సిరంజీల వినియోగం ద్వారా వ్యాధి వ్యాపించే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సురక్షిత పద్ధతులను అనుసరించడం, అవసరమైన సందర్భాల్లో హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పరీక్షలు, చికిత్స, కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని, బాధితులు ఎలాంటి భయం లేకుండా వాటిని వినియోగించుకోవాలని సూచించారు.

పరీక్షలు–చికిత్సలు అందుబాటులో

వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట, ఎంజీఎం, సీకేఎం ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా ఎయిడ్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా ఉచితంగా ఎయిడ్స్ పరీక్షలు నిర్వహిస్తూ, తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమించకుండా నివారణ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎయిడ్స్ నిర్ధారణ అయిన వెంటనే ఏఆర్టీ కేంద్రాల ద్వారా ఉచిత చికిత్సలు అందిస్తున్నారని తెలిపారు. హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్ష చూపకుండా మానవతా దృక్పథంతో సహకరించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా యువతలో అవగాహన పెంపొందించేందుకు పాఠశాలలు, కళాశాలలు, గ్రామ, పట్టణ స్థాయిలో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పల్లెల్లో, పట్టణాల్లో ఎయిడ్స్ నివారణపై కళాజాతలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజలు వీటిలో పాల్గొని సరైన సమాచారం తెలుసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు కోరారు. ఈ సందర్భంగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కార్మికుల కోసం నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంప్‌ను కలెక్టర్ ప్రారంభించి వైద్య పరీక్షలను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వైద్య గణేష్, సంధ్యారాణి, జెడ్పీ సీఈవో రామ్ రెడ్డి, జిల్లా అధికారులు, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశాలు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఎన్జీఓలు, ప్రజలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మక్క రైతులను రోడ్డున పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

మక్క రైతులను రోడ్డున పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెంచకపోతే ఆందోళనలు...

స్మార్ట్ ఫోన్లతో అంగన్వాడీ సేవల్లో పారదర్శకత

స్మార్ట్ ఫోన్లతో అంగన్వాడీ సేవల్లో పారదర్శకత పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి దామెర...

ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు టీఆర్‌పీ మద్దతు

ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు టీఆర్‌పీ మద్దతు.. కాకతీయ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి...

మృతురాలి కుటుంబానికి ఇనుగాల పరామర్శ

మృతురాలి కుటుంబానికి ఇనుగాల పరామర్శ కాకతీయ, గీసుగొండ : కాంగ్రెస్ పార్టీ మండల...

సరుకులన్నింటికీ జండా పాట పెట్టాలి

సరుకులన్నింటికీ జండా పాట పెట్టాలి మిర్చి క్వింటాకు 25వేల రూపాయల మద్దతు ధర...

కాంగ్రెస్ హామీలు అమలు కాలేదు

కాంగ్రెస్ హామీలు అమలు కాలేదు అంగన్వాడీ, ఆశా వర్కర్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఉద్యోగులు, కార్మికులకు...

చాపలబండలో పీడీఎస్ బియ్యం పట్టివేత

చాపలబండలో పీడీఎస్ బియ్యం పట్టివేత - బియ్యం, వేయింగ్ మెషిన్, ట్రాలీ ఆటో...

కొమ్మాల అంగడి బహిరంగ వేలం

కొమ్మాల అంగడి బహిరంగ వేలం విశ్వనాథపురం జీపీలో 13 వారాలకు వేలం రూ.36,71,000/- దక్కించుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img