అమెజాన్ నుంచి ఏఐ ఫోన్
అలెక్సాతో స్మార్ట్ ఫోన్ యుగంలో గేమ్ ఛేంజర్..!
అలెక్సాతో పూర్తి ఇంటిగ్రేషన్ ప్లాన్
షాపింగ్, ప్రైమ్, మ్యూజిక్ ఆల్ ఇన్ వన్ డివైస్
వాయిస్ ఆధారిత యూజర్ అనుభవంపై ఫోకస్
కాకతీయ, బిజినెస్ : ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని షేక్ చేసే ప్లాన్‌తో ముందుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేసేందుకు సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్లో అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ ప్రధాన పాత్ర పోషించనుంది. వినియోగదారులు వాయిస్ కమాండ్స్‌తోనే అనేక పనులు చేయగలిగేలా ఈ డివైస్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏఐ ఫోన్ కేవలం సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా కాకుండా… అమెజాన్ సేవలన్నింటినీ ఒకే ప్లాట్ఫామ్లో అందించేలా డిజైన్ చేస్తున్నారని సమాచారం. అమెజాన్ యాప్ ద్వారా షాపింగ్, ప్రైమ్ వీడియోలో సినిమాలు, అమెజాన్ మ్యూజిక్‌లో పాటలు ఇవన్నీ మరింత సులభంగా వినియోగించుకునేలా ఫీచర్లు ఉండనున్నాయి. అలాగే ఫుడ్ డెలివరీ వంటి సేవలను కూడా ఈ ఫోన్‌తో లింక్ చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
వాయిస్ ఆధారిత అనుభవమే హైలైట్
ఇతర స్మార్ట్ఫోన్లతో పోలిస్తే… ఈ డివైస్‌లో వాయిస్ కమాండ్స్ కీలక పాత్ర పోషించనున్నాయి. అలెక్సా ద్వారా యూజర్ అవసరాలను ముందుగానే అర్థం చేసుకుని సేవలు అందించే విధంగా ఏఐను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఫోన్ ధర ఎంత ఉండొచ్చు? ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది? వంటి అంశాలపై ఇంకా స్పష్టత లేదు. మరింతగా… ప్రాజెక్ట్ అనుకున్న విధంగా ముందుకు సాగకపోతే అమెజాన్ ఈ ప్లాన్‌ను పక్కన పెట్టే అవకాశం కూడా ఉందని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఏఐ స్మార్ట్‌ఫోన్ నిజంగా మార్కెట్లోకి వస్తే… గూగుల్, ఆపిల్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెజాన్ ఈ ప్రయోగం విజయవంతమైతే… స్మార్ట్‌ఫోన్ వాడకం విధానమే మారే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.


