గురుకులంలో అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ
కాకతీయ, ములుగు :ములుగు జిల్లా ములుగు మండలం దేవగిరి పట్టణంలోని *మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల*లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీలత మాట్లాడుతూ, ఐదో తరగతిలో ప్రవేశాల కోసం అర్హులైన తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఐదో తరగతిలో మొత్తం 80 సీట్లు అందుబాటులో ఉండగా, వాటిలో 51 సీట్లు ముస్లిం మైనారిటీలకు, 5 సీట్లు క్రిస్టియన్ మైనారిటీలకు, జైనులకు ఒక సీటు, సిక్కులకు ఒక సీటు, బౌద్ధులకు ఒక సీటు, పార్శీలకు ఒక సీటు కేటాయించారని తెలిపారు. అలాగే బీసీలకు 10 సీట్లు, ఎస్సీలకు 5 సీట్లు, ఎస్టీలకు 3 సీట్లు, ఓసీలకు 2 సీట్లు ఉంటాయని వివరించారు. అదేవిధంగా 6వ, 7వ, 8వ తరగతుల్లో బ్యాక్‌లాగ్ ఖాళీలకు కేవలం ముస్లిం మైనారిటీ బాలికలు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. ఆసక్తి గల తల్లిదండ్రులు http://tgmreis.telangana.cgg.gov.in
వెబ్‌సైట్ ద్వారా ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 93980 19134, 73961 94275, 97019 07575 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి మక్బూల్ పాషా, ఎండి సర్వర్ అహ్మద్, ఎండి హజీ పాషా, ఎస్.కె. ముజామిల్ తదితరులు పాల్గొన్నారు.


