కాకతీయ, హనుమకొండ : జాతీయ భావన, దేశభక్తి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని పాలనకు ఆకర్షితుడైన కొల్లూరి ఆదిత్య సాయి శుక్రవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
ఎల్ఎల్బీ పట్టభద్రుడైన ఆదిత్య సాయి, సామాజిక కార్యకర్తగా బజరంగ్ దళ్‌లో వరంగల్ మహానగర్ సురక్ష ప్రముఖ్, సంయోజక్ బాధ్యతలు నిర్వహించారు. బీజేపీలో చేరిన తర్వాత మాట్లాడుతూ.. వరంగల్ మహానగరంలో బీజేపీ జెండా ఎగరేయడమే నా ప్రధాన లక్ష్యం అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కడవేరు శ్రీనివాస్, నర్మెట్ట శ్రీనివాస్, సండ్ర మధు, సంపత్ రెడ్డి, కూతురు రాజు, అరణ్య రెడ్డి, రిత్విక్ తదితరులు పాల్గొన్నారు.


