- ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
కాకతీయ, కరీంనగర్ : రైతులకు వ్యవసాయం మాత్రమే కాకుండా అదనపు ఆదాయ మార్గాలను కల్పించే పాడిపరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. బుధవారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి పశువులకు మంచి మేత, వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం విడతల వారీగా నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ వారోత్సవాలను రైతులు సద్వినియోగం చేసుకోలన్నారు. కార్యక్రమంలో పశువైద్యాధికారులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, నాయకులు కొత్త తిరుపతిరెడ్డి, గోగూరి నర్సింహారెడ్డి, బుధారపు శ్రీనివాస్, చిరంజీవి, వరాల అనిల్, ఎస్.కొండల్ రావు, చింతల లక్ష్మారెడ్డి, టి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
దళారుల బారిన పడకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సూచించారు. మానకొండూర్ మండలం దేవంపల్లి, కెల్లేడు, రంగపేట, పచ్చునూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో ఐకేపీ, సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఆయనప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాణ్యతాప్రమాణాలను పాటించి, దళారుల మోసాలకు లోనవ్వకూడదని సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి, డైరెక్టర్లు సహదేవ్, రామిడి శ్రీనివాస్ రెడ్డి, సాయిరి దేవయ్య, దాసరి శ్రీనివాస్, టేకుమల్ల అంజయ్య, చలిగంటి ఓదెలు, రావుల రవి, తాళ్లపల్లి సంపత్ గౌడ్, ద్యావ శ్రీనివాస్ రెడ్డి, వాల అంజుత్ రావు, బండి మల్లేశం, రామిడి తిరుపతి, నాగిశెట్టి రాజయ్య, తోట శ్రీనివాస్, బోళ్ల మురళీధర్, కనకం కుమార్, కనకం అశోక్, కోంద్ర సురేశ్, మడుపు ప్రేమ్ కుమార్, తాళ్లపల్లి నరేష్, దుడ్డెల కుమార్, తాళ్లపల్లి కుమార్ పాల్గొన్నారు.


