పుష్కర ఘాటును పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
కాకతీయ, నూగూరు వెంకటాపురం : మండల పరిధిలోని రామచంద్రాపురం పుష్కర ఘాటును ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా అభివృద్ధి అధికారి పరిశీలించారు.
స్థానిక సర్పంచ్, గ్రామ ప్రజలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా పుష్కర ఘాట్ కి ఆర్ అండ్ బి దారి నుంచి ఘాట్ వరకు సిసి రోడ్ నిర్మాణం గురించి, విద్యుత్ సరఫరా గురించి చర్చించడం జరిగింది.
అనంతరం స్థానిక సర్పంచ్ అడిషనల్ కలెక్టర్ కి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు పుష్కర ఘాట్ వద్ద ఉన్న శివాలయం కి నిరంతరం విద్యుత్ ఉండే విధంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు…
తదనంతరం పాత్రా పురం గ్రామ పంచాయతీ రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు
అడిషనల్ కలెక్టర్, జిల్లా అభివృద్ధి అధికారి మాట్లాడుతూ…
నూతన సర్పంచ్ లకు శనివారం నుంచి జరిగే శిక్షణ తరగతులకు సర్పంచ్ లు అందరూ హాజరు కావాలని ఆదేశించింది.
పంచాయతీ అభివృద్ధి కి అందరూ సహకరించి అభివృద్ధి చేసుకోవాలని సూచించారు
నిధుల విషయంలో ఏమైనా తప్పిదాలు జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు
ఇది ఎండా కాలం కాబట్టి నీటి సదుపాయం ఇబ్బంది గా ఉంటుందని, ఎక్కడ కూడా నీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు.
పలు శాఖల అధికారులు నూతన సర్పంచ్ ఉపసర్పంచ్ లతో మాట్లాడి వారి చరవాని నెంబర్ లను ఇవ్వడం జరిగింది.
పంచాయతీ లల్లో ఏ సమస్య ఉన్న వెంటనే ఆ శాఖ వారికి తెలపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి,తాసిల్దార్,నూతన సర్పంచ్ లు,ఉపసర్పంచ్ లు, వార్డు సభ్యులు, పలు శాఖల అధికారులు,ఏఇ,డిఇ లు,ఏఇవో లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


