ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
కాకతీయ,గీసుగొండ : మండలం వంచనగిరిలోని ఆదర్శ పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి మధ్యాహ్నం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను ఆమె స్వయంగా పరిశీలించి రుచి చూశారు. వంటకాల రుచిపై అసంతృప్తి వ్యక్తం చేసిన అదనపు కలెక్టర్, వంట గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. పాఠశాలలోని బోధన, నిర్వహణ అంశాలపై కూడా ఆమె వివరాలు సేకరించారు. విద్యార్థుల అభ్యాసం, హాజరు తదితర అంశాలను సమీక్షిస్తూ మరింత నాణ్యత సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యా యులను ఆదేశించారు.ఈ తనిఖీలో స్థానిక తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్,ఇన్‌చార్జ్ ఎంపీడీఓ శ్రీనివాస్,పాఠశాల ప్రిన్సిపాల్ సునీత తదితరులు పాల్గొన్నారు.
ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


