epaper
Monday, March 2, 2026
epaper

ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిష‌న‌ల్ చార్జిషీట్‌

ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిష‌న‌ల్ చార్జిషీట్‌
దూకుడుగా స‌జ్జ‌నార్ నేతృత్వంలోని సిట్‌
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు
ట్యాపింగ్ రివ్యూ కమిటీ సభ్యుల మరోసారి విచారణ
ముగ్గురు మాజీ సీఎస్‌లు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ల స్టేట్‌మెంట్లు
రాజకీయ, వ్యాపార, మీడియా వర్గాల ఫోన్ల ట్యాపింగ్‌పై స్పష్టత

కాక‌తీయ‌, హైదరాబాద్ : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో సిట్‌ దూకుడు పెంచింది. దీంతో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ట్యాపింగ్‌ రివ్యూ కమిటీలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారులను సిట్‌ మరోసారి విచారించింది. అప్పట్లో ఎస్ఐబీ చీఫ్‌గా ఉన్న ప్రభాకర్‌ రావు హయాంలో రివ్యూ కమిటీలో సభ్యులుగా ఉన్న జీఏడీ సెక్రటరీ, మాజీ సీఎస్‌లు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ను సిట్‌ విచారించి వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. ముగ్గురు మాజీ ఐఏఎస్‌లతోపాటు మాజీ ఐపీఎస్‌ అధికారులను సాక్షులుగా విచారించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో ఈ అధికారులు పోషించిన పాత్రపై సిట్‌ పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.

ముగ్గురు సీఎస్‌ల‌తో విచార‌ణ‌

మాజీ సీఎస్‌లు సోమేశ్‌కుమార్‌, శాంతి కుమారిలతోపాటు సాధారణ పరిపాలన శాఖ మాజీ పొలిటికల్‌ సెక్రటరీ రఘునందన్‌రావు, మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ నవీన్‌చంద్‌ను సిట్‌ విచారించింది. ఎస్ఐబీ ఓఎస్‌డీగా ప్రభాకర్‌ రావు నియామకంపై అప్పట్లో తీసుకున్న నిర్ణయాలపై ఐఏఎస్‌లను ప్రశ్నించినట్లు తెలిసింది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధుల ఫోన్లను కూడా ప్రభాకర్‌ రావు ట్యాప్‌ చేసినట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. ప్రభాకర్‌ రావు ఇచ్చిన ఫోన్‌ నెంబర్లను యథావిధిగా హోంశాఖకు ఈ మాజీ ఐపీఎస్‌ అధికారులు పంపినట్లు వెల్లడైంది. ఈ ఆధారాలతో అనుబంధ చార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు సిట్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో చార్జ్‌షీట్‌ వేయాలని సిట్‌ చీఫ్‌, హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ ఆదేశించిన విషయం తెలిసిందే.

రంగంలోకి సిద్ధిపేట సీపీ

ఇదిలా ఉండగా, ప్రభాకర్‌ రావు కస్టడీ విచారణ మూడో రోజుకు చేరింది. ఆయన్ని విచారించేందుకు సిట్‌ సభ్యుడైన సిద్ధిపేట సీపీ విజయ్‌కుమార్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ప్రభాకర్‌ రావును విజయ్‌కుమార్‌ విచారించనున్నారు. గతంలో ఇదే కేసులో పలుమార్లు ఆయనే విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరిన్ని కీలక పరిణామాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డీజీపీకి వినతిపత్రం...

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం జీవో 252 ప్రకారం అమలు…...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ రూ.50 వేలు డిమాండ్‌… ఏసీబీ ట్రాప్‌లో...

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలి 8,203 పోలింగ్ కేంద్రాల్లో భద్రత...

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం ఎన్‌సీసీ సేవలను ప్రశంసించిన జిష్ణు దేవ్...

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర!

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర! దొడ్డిదారిన నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నం నిరుద్యోగుల నోట్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img