- బీసీ అజాదీ ఫెడరేషన్ డిమాండ్
కాకతీయ, కరీంనగర్ : వరంగల్ ఉర్సు దర్గా ప్రాంతంలో సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని బీసీ అజాదీ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుడికాల భాస్కర్ తీవ్రంగా ఖండించారు. జ్యోతిబా ఫూలే వంటి మహానుభావులు సమాజంలో అణగారిన వర్గాలకు విద్య, సమానత్వం, హక్కుల కోసం జీవితాంతం పోరాడినవారని గుర్తుచేశారు. అలాంటి మహనీయుని విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే సామాజిక విలువలపై దాడి చేసినట్టేనని భాస్కర్ అన్నారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి దోషులను అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లావ్యాప్తంగా బీసీ అజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.


