కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : కేజీబీవీ ఎస్వోపై చర్యలు తీసుకోవాలని ఎన్టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ రామన్న నాయక్ , ఎల్ హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంగోత్ చందులాల్ అన్నారు. మంగళవానం ఈ మేరకు వారు డీఈవోకు చర్యల కోసం వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గూడూరు మండలం లోని బ్రాహ్మణపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల (కేజీబీవీ)లో ఎస్ఓ బియ్యం అమ్మకం ఘటనపై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందన్నారు. నెల రోజుల క్రితం బియ్యం అమ్మకంలో పట్టుబడినప్పటికీ ఇప్పటివరకు సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఎస్ వో పోలేపల్లి సునీత అవినీతి పై సమగ్రమైన విచారణ జరిపించి వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.


