- నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
కాకతీయ, నర్సంపేట: రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించాలని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి అన్నారు. బుధవారం వ్యవసాయ మార్కెట్ ఆవరణలోప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు పంట దిగుబడి పట్ల అవగాహన కలిగిఉండాలని, తక్కువ ఎరువులను వాడుతూ అధిక దిగుబడులు వచ్చే విధంగా శాస్త్రీయ కోణంలో వ్యవసాయం చేయాలన్నారు. పంటకు పంటకు మధ్య క్రాప్ హాలిడే పాటిస్తూ వ్యవసాయన్ని కొనసాగించాలని సూచించారు. తద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చునన్నారు. కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నర్సంపేట పీఎసీఎస్ చైర్మన్ బొబ్బల రమణారెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.


