కాకతీయ, హనుమకొండ : హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో జరిగిన హత్య కేసులో నిందితుడు పాలత్య రమేష్‌కు జీవిత ఖైదు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ, అడిషనల్ డిస్ట్రిక్ & సెషన్స్ జడ్జి బి. అపర్ణా దేవి శుక్రవారం తీర్పు ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రాంతానికి చెందిన రమేష్, మృతుడు యంజాల శివతో స్నేహితులుగా ఉండేవాడు.
ఇద్దరూ కూలి పనులు, చిల్లర దొంగతనాలు చేసి వచ్చిన డబ్బు పంచుకునేవారు. తరచూ గొడవలు జరిగే పరిస్థితిలో, 2023 సెప్టెంబర్ 11న అశోక్ జంక్షన్ వద్ద రమేష్ కర్రతో శివపై దాడి చేసి, భవనం పై నుంచి తోసి హత్య చేశాడు. కేసులో కచ్చితమైన సాక్షాలు సమర్పించిన హనుమకొండ పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజ మల్లారెడ్డి, కోర్టు లైజన్ అధికారులు కృషి చేయగా, నిందితుడికి శిక్ష ఖరారైంది. ఈ సందర్భంగా కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, అప్పటి ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, ప్రస్తుత ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్‌తో పాటు విచారణలో సహకరించిన సిబ్బందిని అభినందించారు.


