పాలకుర్తిలో భక్తుల సౌకర్యార్థం వసతి గృహాలు
సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఆలయంలో వసతి గృహాల నిర్మాణానికి భూమి పూజ
టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి
కాకతీయ,రాయపర్తి /పాలకుర్తి: పాలకుర్తి మండలంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం వసతి గృహాల నిర్మాణానికి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు.ఈ సత్రాల నిర్మాణం తమ సొంత నిధులతో చేపడుతున్నామని ఆమె పేర్కొన్నారు.43వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నామని, ఇక్కడి ప్రజలకు ఎంత చేసినా తక్కువేనని అన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రతీది ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. స్వామివారిని దర్శించుకునే యాత్రికులు,భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


