కాంగ్రెస్ కమిటీలకు దరఖాస్తుల స్వీకరణ
కాకతీయ, కరీంనగర్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీల్లో నూతన నియామకాల కోసం ఆశావాహుల నుంచి దరఖాస్తులను మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో స్వీకరించారు. పీసీసీ ప్రతినిధులు నమిండ్ల శ్రీనివాస్, గౌస్ పాషా, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, ఆర్టీఏ నెంబర్ పడాల రాహుల్ ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గత పదేళ్లుగా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలకు జిల్లా కాంగ్రెస్, కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీల్లో వివిధ పదవులు కేటాయించనున్నట్లు తెలిపారు. పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి న్యాయం జరిగేలా కమిటీల్లో బాధ్యతలు ఇవ్వడమే కాకుండా, దేవస్థానాలు, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పదవులకు కూడా నామినేషన్లు చేపట్టి అధిష్టానం సముచిత నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎండీ తాజ్, శ్రావణ్ నాయక్, సిరాజుద్దీన్, ఎస్.ఏ. మోసిన్, అహమ్మద్ అలీ, అబ్దుల్ రహమాన్, సిరిపురం నాగప్రసాద్తో పాటు పెద్ద సంఖ్యలో ఆశావాహులు పాల్గొన్నారు.


