epaper
Thursday, March 19, 2026
epaper

ఏసీ షార్ట్ సర్క్యూట్‌తో దారుణం..!

ఏసీ షార్ట్ సర్క్యూట్‌తో దారుణం..!
తండ్రీకూతుళ్లు సజీవ దహనం
కాజీపేటలో విషాద ఘటన కలకలం
తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం
గాఢ నిద్రలో ఉండగా మంటల్లో చిక్కుకున్న బాధితులు

కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కాజీపేట మండలం కడిపికొండలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి తండ్రీకూతుళ్లు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులను రాజశేఖర్ (54), ఆయన కుమార్తె రాజశ్రీ (24)గా గుర్తించారు. రాజశేఖర్ స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. బుధవారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంట్లో ఉన్న ఏసీ షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల మంటలు వ్యాపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గాఢ నిద్రలో ఉన్న తండ్రీకూతుళ్లు బయటకు రావడానికి అవకాశం లేకపోయిందని తెలుస్తోంది. మంటలు వేగంగా వ్యాపించడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.

ఏసీయే కారణమా..?

పోలీసుల ప్రాథమిక అంచనాల ప్రకారం గదిలో ఉన్న ఏసీ యంత్రంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. విద్యుత్ సంబంధిత లోపాల వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఇంట్లో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో బయటకు తప్పించుకునే అవకాశం లేకపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో కాలనీలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే కాజీపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నదానిపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపడుతున్నారు. విద్యుత్ లోపం కారణమా, లేక ఇతర కారణాలున్నాయా అన్నదానిపై స్పష్టత రానుంది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్థానికులు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సైకిల్ స్టాండ్ పేరిట అక్రమ వసూళ్లు

సైకిల్ స్టాండ్ పేరిట అక్రమ వసూళ్లు భక్తులను వేధించిన వ్యక్తులపై కేసు న‌మోదు విచారణ...

అల్లుడే హంత‌కుడు ?

అల్లుడే హంత‌కుడు ? సుత్తితో తలపై కొట్టి.. ఇద్దరిపై డీజిల్ పోసి తగలుబెట్టి.. భార్య,...

వ్యాధి నిరోధక వంగడాలు వాడాలి..

వ్యాధి నిరోధక వంగడాలు వాడాలి.. *రైతు శిక్షణ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు కాకతీయ,గీసుగొండ: పంటలను...

మౌలిక వసతులు క‌ల్పించాలి

మౌలిక వసతులు క‌ల్పించాలి కాకతీయ,ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ మండలంలోని 37, 38...

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి కాకతీయ, దుగ్గొండి: విద్యార్థులు ప్రాధమిక దశలో అభ్యసించిన...

ప్రజా సంక్షేమమే లక్ష్యం

ప్రజా సంక్షేమమే లక్ష్యం టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి కాంగ్రెస్‌లోకి చేరిక‌లు కాకతీయ, పెద్దవంగర : ప్రజా...

అనుమతి లేకుండా అడుగుపెట్టొద్దు

అనుమతి లేకుండా అడుగుపెట్టొద్దు ట్రాన్స్‌కోలో సీఈ తీరుపై విమర్శలు వరంగల్ జోన్‌లో చీఫ్ ఇంజనీర్‌పై...

ములుగులో గ్యాస్ కొరత లేదు

ములుగులో గ్యాస్ కొరత లేదు బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు గ్యాస్ సరఫరాపై కలెక్టర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img