- జూనియర్ కమిషన్ ఆఫీసర్ సౌరస్య
కాకతీయ, వరంగల్ : వరంగల్ ములుగు రోడ్ వద్ద గల లాల్ బహదూర్ కళాశాలలో ఎన్ సీసీ తెలంగాణ 10వ బెటాలియన్ ఆర్మీ వింగ్ ఆధ్వర్యంలో శనివారం ఉద్యోగ అవకాశాలు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డీహెచ్.అరుణ రావు తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ కమిషన్ ఆఫీసర్ సౌరస్య మాట్లాడుతూ 30సంవత్సరాల నుంచి ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేశానన్నారు. క్రమశిక్షణకు మారుపేరు ఇండియన్ ఆర్మీ అని, కష్టపడి ‘సీ’ సర్టిఫికెట్ లో పాస్ అయితే ఆర్మీలో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు.
రాత పరీక్ష అవసరం లేదని, అగ్నివీర్, పారా మిలిటరీ, ఆర్ముడ్ ఫోర్స్ వంటి వాటిలో ఉజ్వల భవిష్యత్ ఉందని వివరించారు. ఎన్ సీసీ కష్టపడి పూర్తిచేసి దేశ సేవకు సిద్ధం కావాలని తెలిపారు. తమ కళాశాల ఆర్మీ ప్రవేశాలకు దేవాలయం లాంటిదని ఇక్కడ జాయిన్ అయినా వారు వందల మంది ఆర్మీలో పని చేస్తున్నట్లు ఆమె తెలిపారు. డ్రిల్ ఇన్స్పెక్టర్ నిఖిలేష్ హావల్దార్ మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళిక బద్ధంగా కష్టపడితే ఆర్మీలో ప్రవేశాలు సులభమేనని తెలిపారు.
అనంతరం ఇక్కడ పనిచేసి వెళ్ళిపోతున్న సౌరస్య, నిఖిలేష్ ను ఎన్ సీసీ క్యాడేట్స్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కెప్టెన్ డాక్టర్ ఎం.సదానందం, అధ్యాపకులు ఎస్.సతీష్ కుమార్, జూనియర్ అండర్ ఆఫీసర్ శివకుమార్, ఆర్ఎ శివాని, రిషిత్ నంద, సాయి గణేష్, శ్రావణి, సోహెల్, హరి లోకేష్, కౌశిక్, నితీష్, రజిత, పూజిత, సంజన, మొదలకు వారు పాల్గొన్నారు.


