కాకతీయ, నేషనల్ డెస్క్: పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లే.. వేలాది కార్మికులకు.. ముఖ్యంగా మహిళలకు.. అతి పెద్ద సాం త్వన చేకూరింది. ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలకు ఉత్సాహంగా వెళ్లిన వారే కానీ, అంతే ఉత్సాహంగా తిరిగి తమ తమ దేశాలకు చేరుకున్న వారు లేరు. దీనికి కారణం.. అక్కడ తాము పనిచేస్తున్న ప్రాంతాల్లో ఎదురై న అనేక ఇబ్బందులే. మరో మాటలో చెప్పాలంటే.. తాము పనిచేస్తున్న సంస్థలు లేదా ఇళ్లలోని యజమా నులు పెట్టే నరకమే!. ఈ క్రమంలో ఇటీవలకాలంలో అనేక మంది తమను తిరిగి స్వదేశానికి తీసుకురా వాలని.. తాము ఇక్కడ(సౌదీ) బాధలు భరించలేక పోతున్నామని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను వేడుకుంటున్న వీడియోలు వెలుగుచూశాయి.
మరి ఎన్నో ఆశలతో పది రూపాయలు అధికంగా ఆర్జించుకోవచ్చన్న భావనతో సౌదీకి వెళ్లిన వారు ఇన్ని కష్టాలు పడడం ఏంటి? ఇంతగా కన్నీరు కార్చడం ఏంటి? అంటే.. దీనికి ప్రధాన కారణం.. కఫాలా వ్యవస్థ. అంటే ఒకరకంగా.. ఇది నియంతృత్వ వ్యవస్థ. భారత్ సహా ఆసియా దేశాల నుంచి అనేక మంది కార్మికులు.. మహిళలు పొట్ట చేత పట్టుకుని సౌదీలోని అరబ్ దేశాలకు వెళ్తుంటారు. కానీ, అక్కడకు వెళ్లడం వరకే వారికి స్వేచ్ఛ ఉంటుంది. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత.. సర్వస్వం.. యజమాని చెప్పుచేతల్లోనే ఉండాలి. వారు కూర్చోమంటే కూర్చోవాలి.. నిలబడమంటే నిలబడాలి.
పెడితేనే ముద్ద.. పోస్తేనే నీరు!
అన్నట్టుగా సౌదీలో కార్మికుల కష్టాలు ఉంటున్నాయి. పోనీ.. తిరిగి సొంత ప్రాంతానికి వచ్చేయాలన్నా.. స్వేచ్ఛ ఉండదు. అదే.. కఫాలా వ్యవస్థ తెచ్చిన ప్రధాన కష్టం. ఒకరకంగా చెప్పాలంటే.. ఇతర దేశాల నుంచి పని కోసం వెళ్లిన వారిని యజమానులు బానిసలుగా చూసినా భరించక తప్పదు. అంతేకాదు.. సమయానికి నిద్ర కూడా పోనివ్వకుండా వేధించిన యజమానులు కూడా ఉన్నారు. జీతం సరిగా ఇవ్వరు, అన్నం పెట్టరు.. దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదు. యజమాని దగ్గరే పాస్‌పోర్టు ఉంటుంది. ఆయన అనుమతితోనే ఎక్కడికైనా వెళ్లాలి. ఇంట్లో వారికి అనారోగ్యంగా ఉన్నా, మృతిచెందినా, యజమాని అనుమతి లేనిదే కదలడానికి వీల్లేదు. ఇన్నింటికీ మూలం కఫాలా వ్యవస్థ.
కఫాలా.. అనేది భాగస్వామ్య పదానికి అరబిక్ రూపం. అంటే.. “
నేను నీకు పనిచ్చాను. నువ్వు నేను చెప్పినట్టే వినాలి“ అనే భావన. ఇది 1950లో వచ్చిన విధానం. అప్పట్లో కార్మికులను పెంచుకునేందుకు తీసుకువచ్చిన ఈ వ్యవస్థ రాను రాను నియంతృత్వంగా మారింది. ఫలితంగా కార్మికులు నానా అగచాట్లు పడుతున్నారు. ఒక్క భారతే కాదు.. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక.. ఇలా అనేక దేశాల నుంచి పొట్ట చేతపట్టుకుని సౌదీకి వెళ్లిన వారి సమస్యలు చెప్పనలవి కానివి. అనేక మంది ప్రాణాలు కూడా అక్కడే వదిలేశారు.
ఎట్టకేలకు మోక్షం…
ఈ పరిణామాలను, యజమానుల తీరునునిశితంగా గమనించిన సౌదీ ప్రభుత్వం ఇటీవల సర్వే చేయిం చింది. అనేక కేసులు పెరిగిపోతుండడం కూడా దీనికి కారణం. ముఖ్యంగా భారత్ వంటి మిత్ర దేశాల నుంచి కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో అన్నీ ఆలోచించి 1950ల నాటి ఈ కఫాల వ్యవస్థను సౌదీ రద్దు చేసింది. అయితే.. యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాలు మాత్రం ఈవిషయంలో ఇంకా నాన్చుడు ధోరణిలో ఉన్నాయని తెలుస్తోంది.


