ప్రజావాణి రద్దు
మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిర్ణయం
కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న దృష్ట్యా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండటంతో సోమవారం నిర్వహించలేమని వెల్లడించారు.
ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.
సిరిసిల్లలోనూ..
కాకతీయ, సిరిసిల్ల టౌన్: వేములవాడ మహా శివరాత్రి జాతర, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. అధికారులు అందరూ వేములవాడ మహా శివరాత్రి జాతర, ఎన్నికల విధుల్లో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.


