కాకతీయ, నెల్లికుదురు: మండలంలో బడి తండా లోని వరం బండ తండా కు చెందిన ఎంపీపీఎస్ పాఠశాలలో మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రావుల దేవేందర్ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి గణేష్ లతో కలిసి అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సామాన్య కుటుంబం నుంచి దేశం గర్వించదగిన శాస్త్రవేత్తగా ఎదిగారన్నారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా ఖ్యాతి గడించిన కలాం తన విజ్ఞానంతో కోట్లాది హృదయాలను గెలవటంతో పాటు, తన ప్రసంగాలతో ఎంతో మంది యువతలో స్ఫూర్తి నింపారని కొనియాడారు. కలాం జయంతిని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణమని, ఆ మహనీయుని సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి గణేష్, ఉపాధ్యాయులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


