18 కిలోలు తగ్గిన ఆమిర్ ఖాన్ ..
కాకతీయ, సినిమా డెస్క్: బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరోసారి తన శారీరక మార్పుతో చర్చనీయాంశంగా మారారు. ఈసారి సినిమా పాత్ర కోసం కాదు, పూర్తిగా ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ సాధించినట్లు వెల్లడించారు. కఠినమైన వర్కౌట్స్ లేదా జిమ్ రూటీన్స్ కాకుండా, ప్రత్యేకంగా రూపొందించిన యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డైట్ ద్వారా ఆయన ఏకంగా 18 కిలోల బరువు తగ్గారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ… ఈ మార్పు తాను ఊహించనంత సహజంగా జరిగిందని తెలిపారు. మైగ్రేన్ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు మొదలుపెట్టిన ఈ డైట్, బరువు తగ్గడంలో కూడా అద్భుత ఫలితాలు ఇచ్చిందని చెప్పారు. “ఇది ప్లాన్ చేసిన వెయిట్ లాస్ కాదు. ఆరోగ్యం కోసం చేసిన ప్రయత్నమే ఈ మార్పుకు కారణం” అని ఆమిర్ స్పష్టం చేశారు.


