కాకతీయ, రామకృష్ణాపూర్ : బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా బొక్కల గుట్ట సర్వీస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మరణించింది. స్థానిక ఎస్సై జి.రాజశేఖర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భర్త సురేష్, భార్య కవిత, కూతురు భార్గవి స్కూటీపై బెల్లంపల్లి పెళ్ళికి వెళ్ళి తిరిగి మంచిర్యాలకు వస్తున్నారు. బొక్కల గుట్ట సమీపంలోని సర్వీసు రోడ్డులో సాయంత్రం ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొనడంతో క్షతగాత్రులను తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కొరకు కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో కవిత మృతి చెందింది. అ జాగ్రత్తగా ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవరుపై చర్య తీసుకోవాలని భర్త సుభాష్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


