చంద్రయ్యపల్లిలో చోరీల కలకలం
వారం రోజుల వ్యవధిలో రెండు దేవాలయాల్లో 30 వేల విలువైన గంటల అపహారణ
నిందితులను పట్టుకోవాలని గ్రామస్తుల వేడుకొలు
కాకతీయ, దుగ్గొండి: దేవాలయాల్లో గుడి గంటల వరుస చోరీలతో మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో కలకలం రేగుతుంది. తెలిసిన వారి పనేనా లేక బైట నుండి వచ్చి గ్రామంలోని దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారా అని గ్రామస్థుల్లో సందేహం నెలకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పిభ్రవరి చివరి వారంలో హనుమాన్ దేవాలయంలో 20 వేల రూపాయల విలువైన ఐదు గంటలలు అపహారణ జరగగా, నేడు పెద్దమ్మ తల్లి గుడిలోని మూడు గంటలు దొంగిలించబడ్డయని తెలిపారు. ఇవేకాకుండా గత మూడు నెలల క్రితం పక్కన గ్రామమైన మల్లంపల్లిలోని రేణుక ఎల్లమ్మ కంఠ మహేశ్వర దేవాలయంలోని కంచు గంటలు కూడా అపహారణకు గురయ్యాయి. దేవుడి గుడిలో వరుస దొంగతనాలు చేసే వారిని గుర్తించి, శిక్షించాలని గ్రామాల్లోని ప్రజలు కోరుకుంటున్నారు.


