వరల్డ్‌కప్ విజేత అనితకు ఘన స్వాగతం
కాకతీయ, నెల్లికుదురు: ప్రపంచ షూటింగ్ బాల్ వరల్డ్‌కప్ సాధించిన నునావతు అనితకు స్వగ్రామం పడమటి గడ్డ తండాలో ఘనస్వాగతం లభించింది. గురువారం మేచరాజుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తండాకు చేరుకున్న ఆమెను గ్రామస్తులు పూలదండలు, శాలువాలతో సత్కరించి ఊరేగింపుగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ దేశం తరఫున ఆడి ప్రపంచకప్ సాధించడం గర్వకారణమని అన్నారు. పుట్టిన ఊరుకు పేరు తేవడం ఆనందంగా ఉందని, తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహంతో ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. పుట్టినిల్లు, మెట్టినిల్లు రెండూ ఒకే తండా కావడంతో గ్రామంలో ప్రత్యేక సంబరాలు ఘనంగా నిర్వహించారు.


