కాకతీయ, ఇనుగుర్తి : మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మన్యం వీరుడు కొమరం భీమ్ వర్ధంతిని అంబేద్కర్ సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం యువజన అధ్యక్షుడు పప్పుల వెంకన్న, ప్రధాన కార్యదర్శి మహంకాళి రామ్ సలీమ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కొమరం భీమ్ ఆశయాలను కొనసాగించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో దీకొండ వెంకన్న, దార్ల రామ్మూర్తి, గుజ్జునూరు బాబురావు, నాళ్ల మురళి, మారం రాము, జాటోత్ హరిచంద్, చిన్నాల కట్టయ్య, రజిని, రమేష్, యాకయ్య, రాము, దుంపల సందీప్, వెంకటేశ్వర్లు, హరీష్, వెంకన్న, సాయిలు, సంపత్ పాల్గొన్నారు.


