epaper
Monday, March 2, 2026
epaper

ప్రయాణికుల సహనానికి పరీక్ష

ప్రయాణికుల సహనానికి పరీక్ష
నత్త నడకన ములుగు బస్టాండ్ పనులు
కాంట్రాక్టర్ అలసత్వం… అధికారుల నిర్లక్ష్యం
ఎనిమిది నెలలైనా బేస్‌మెంట్ దశే
రోడ్లపైనే బస్సుల కోసం ప్ర‌యాణికుల‌ నిరీక్షణ
మంత్రి సీతక్క అసహనం… 12లోగా పూర్తి చేయాలని ఆదేశాలు

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ములుగు నూతన బస్టాండ్ నిర్మాణ పనులు నత్త నడకన సాగుతుండటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లా ఏర్పాటైన తర్వాత ఆధునిక హంగులతో బస్టాండ్ నిర్మించాలని పలుమార్లు డిమాండ్ చేయగా, స్పందించిన రాష్ట్ర మంత్రి సీతక్క సుమారు రూ.2 కోట్ల 70 లక్షల నిధులతో పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే ఎనిమిది నెలలు గడిచినా పనులు ఇంకా బేస్‌మెంట్ దశ దాటకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాకే ప్రతీకగా నిలవాల్సిన బస్టాండ్, ప్రస్తుతం ప్రయాణికుల కష్టాలకు చిహ్నంగా మారిందన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

రోడ్లపైనే ప్రయాణికుల అవస్థలు…

బస్టాండ్ నిర్మాణం పేరుతో పాత బస్టాండ్‌ను మూసివేయడంతో, ప్రయాణికులు జాతీయ రహదారి పక్కనే బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. బస్సులు ఎక్కడ ఆగుతాయో స్పష్టత లేక అయోమయం నెలకొంది. ఎండలో రోడ్డు పక్కనే నిలబడాల్సి రావడం, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, కూర్చునే సదుపాయాలు, మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రయాణం నరకప్రాయంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. బస్టాండ్ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనుల స్థలంలో రోజూ చూసినా కేవలం కొద్దిమంది కార్మికులు మాత్రమే కనిపిస్తున్నారని, నెలలు గడిచినా నిర్మాణంలో గణనీయమైన పురోగతి లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే పనులు సాగుతున్నాయే తప్ప పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి కనిపించడం లేదని విమర్శిస్తున్నారు.

కుంటి సాకులతో తప్పించుకుంటున్న అధికారులు

బస్టాండ్ నిర్మాణాన్ని పర్యవేక్షించాల్సిన సంబంధిత శాఖాధికారులు కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనులు ఎప్పుడు పూర్తవుతాయని ప్రజలు ప్రశ్నిస్తే, నిధుల సమస్య, టెక్నికల్ ఇష్యూలు అంటూ సాకులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తమవుతోంది. ఇప్పటికీ ఖచ్చితమైన గడువును ప్రకటించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల మేడారం జాతర పనుల పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో, ములుగు జిల్లా కేంద్రంలోని నూతన బస్టాండ్ నిర్మాణంపై మంత్రి సీతక్క తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. పనుల పురోగతిపై సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ నెల 12లోగా బస్టాండ్‌లోకి ప్రయాణికులు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా పనులు వేగవంతం చేసి ప్రయాణికుల కష్టాలకు ముగింపు పలకాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img