జర్మనీలో జనగామ విద్యార్థి మృతి
ఉన్నత చదువుల కోసం వెళ్లిన హృతిక్ రెడ్డి
అగ్నిప్రమాదంలో చిక్కుకుని మృతి
కాకతీయ, జనగామ : ఉన్నత విద్యాభ్యాసం కోసం జర్మనీకి వెళ్లిన తెలంగాణకు చెందిన తెలుగు విద్యార్థి అగ్నిప్రమాదంలో మృతి చెందడం విషాదం కలిగించింది. జనగామ జిల్లా వాసి తోకల హృతిక్ రెడ్డి జర్మనీలో నివసిస్తున్న అపార్ట్మెంట్లో ఇటీవల అగ్నిప్రమాదం జరిగింది. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో భయంతో బిల్డింగ్ పై నుంచి దూకిన హృతిక్ రెడ్డికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హృతిక్ రెడ్డి ఉన్నత చదువుల కోసం కొద్దికాలం క్రితమే జర్మనీకి వెళ్లినట్లు తెలిసింది. యువకుడి మృతి వార్తతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.


