కరీంనగర్ భగత్‌నగర్ అంజనాద్రి క్షేత్రంలో ఆధ్యాత్మిక వింత.
హనుమాన్ విగ్రహంపై కార్తీక పౌర్ణమి సూర్యకిరణాల వెలుగు.
కాకతీయ, కరీంనగర్ : కార్తీక పౌర్ణమి పుణ్యకాలంలో కరీంనగర్ పట్టణంలోని భగత్‌నగర్‌లో గట్టుమీద వెలసిన అంజనాద్రి క్షేత్రంలో ఆధ్యాత్మిక వింత చోటుచేసుకుంది. బుధవారం ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు నేరుగా స్వయంభు వెలిసిన హనుమాన్ స్వామి వారి విగ్రహంపై పడి భక్తుల హృదయాలను ఆకట్టుకున్నాయి.ప్రతీ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజునే సూర్యకిరణాలు ఈ విధంగా స్వామి వారి విగ్రహాన్ని తాకుతాయని ఆలయ పూజారులు తెలిపారు. ఇది దేవస్థాన నిర్మాణ శైలిలోని విశిష్టతను, ఆ స్థల పవిత్రతను ప్రతిబింబిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి, హరినామ స్మరణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


